సుమంత్ ‘మ‌ళ్లీ మొద‌లైంది’ ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్ విడుదల..!

‘సత్యం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నట వారసుడు సుమంత్. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందిన సుమంత్ ఆ తర్వాత కాలంలో నటించిన సినిమాలన్నీ దాదాపుగా బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. ఇటీవలి కాలంలో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక సినిమాల విషయానికొస్తే సుమంత్ ప్రస్తుతం ‘మ‌ళ్లీ మొద‌లైంది’ సినిమాలో నటిస్తున్నారు. నైనా గంగూలీ ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. విడాకులు, రెండో పెళ్లి కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల మనుసు గెలుచుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. డైరెక్ట‌ర్ టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. లైఫ్ ఆఫ్ట‌ర్ మ్యారేజ్ అంటూ డిఫ‌రెంట్ మూడ్స్‌లో ఉన్న హీరో సుమంత్‌, నైనా బెడ్‌పై ఉన్న స్టిల్స్‌ను పోస్ట‌ర్‌లో చూపించాడు డైరెక్టర్. కె.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బట్టి సుమంత్‌కు రెండో పెళ్లి అంటూ వచ్చిన వార్తలు సినిమా పరమైనవేనని తేల్చేశాయి.

Share post:

Popular