ప్రియుడితో కిచెన్‌లో శ్రుతి కుస్తీలు..వీడియో వైర‌ల్‌!

లాంగ్ గ్యాప్ త‌ర్వాత క్రాక్, వ‌కీల్ సాబ్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి సూప‌ర్ హిట్ల‌ను ఖాతాలో వేసుకున్న శ్రుతి హాస‌న్.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ సినిమా చేస్తూ మంచి జోరు మీద ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా ఓ వీడియో షేర్ చేసింది.

ఈ వీడియోలో ప్రియుడు శంతను హజరికాతో కిచెన్‌లో శ్రుతి కుస్తీలు ప‌డింది. అలా అని వంట చేసిందని అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే, చేసిన వంట‌ల‌నే ప్రియుడుతో క‌లిసి కిచెన్‌లో కూర్చుని ఫుల్‌గా లాగించేసింది.

ఇందుకు సంబంధించిన వీడియోకు.. `కలిసి తినగలిగిన వాళ్లే కలిసి ఉంటారు.. ఇదో సాధారణమైన సాయంకాలం.. ఫ్రీగా ఫుడ్ దొరికింది` అంటూ శ్రుతి కామెంట్ పెట్టింది. దాంతో ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

https://www.instagram.com/reel/CRJzl5WhPMB/?utm_source=ig_web_copy_link

Share post:

Latest