సీనియర్ హీరోకి తీవ్ర గాయాలు..!

ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాలలో కొందరు ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. గత కొద్ది రోజుల ముందే కత్తి మహేష్ కి ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. తాజాగా సీనియర్ నటుడు కార్తీక్ కు కూడా ఓ ప్రమాదం చోటుచేసుకుంది. తమిళ సీనియర్ నటుడు అయిన కార్తీక్ రోజూ లాగే వ్యాయామం చేస్తుండగా ప్రమాదం జరిగింది. వ్యాయామం చేస్తుండగా ఉన్నట్టుండి ఆయన కింద పడిపోయాడు. ఆ ప్రమాదంలో ఆయన మెడకు, కాలుకు గాయాలయ్యాయి.

- Advertisement -

దీంతో కుటుంబీకులు వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. కార్తీక్ ని పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. కార్తీక్ తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని చెరిగిపోయిన సినిమాలను అందిచారు. ఆయన నటించిన ‘సీతాకోక చిలుక’, ‘అన్వేషణ’, ‘మగరాయుడు’, ‘అభినందన’, ‘అనుబంధం’, ‘ఘర్షణ’ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

Share post:

Popular