`రామారావు`గా వ‌స్తున్న‌ ర‌వితేజ..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రం సెట్స్ మీద ఉండ‌గానే.. శ‌రత్ మండవ అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు ర‌వితేజ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు.

ఇటీవ‌లె పూజా కార్యక్రమాలతో ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌ను రివిల్ చేస్తూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ చిత్రానికి రామారావు అనే టైటిల్‌ను ఖ‌రారు. ఆన్ డ్యూటీ అన్న‌ది ట్యాగ్ లైన్‌.

అలాగే తాజాగా విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ అదిరిపోయింద‌ని చెప్పాలి. ఈ పోస్ట‌ర్‌లో ర‌వితేజ ఎంతో స్టైలిష్‌గా, ప‌వ‌ర్ ఫుల్‌గా క‌నిపిస్తున్నారు. కాగా, రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‌గా ఈ చిత్రంలో కనిపించబోతోన్నాడని తెలిసిందే. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Image