ఫ్యాన్స్‌ను ఖుషి చేస్తున్న రాశీఖ‌న్నా జిమ్ వీడియో…!

టాలీవుడ్ బ్యూటీగా పేరు గాంచిన రాశీ ఖ‌న్నా సోషల్‌మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫోటోషూట్‌లు చేస్తూ ఆ ఫొటోల‌తో కుర్రకారుని అక్కటుకుంటుంది. ఆ మధ్య వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో చాలా బోల్డ్ రోల్‌లో నటించిన రాశీ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యనికి గురి చేసింది.

అప్పటిలో చాలా బొద్దుగుమ్మలా ఉన్న రాశీ, ప్రస్తుతం మాత్రం నాజూగ్గా మారిపోయి అంద‌రికీ షాక్ ఇస్తుంది. అందు కోసం రాశీ ఖన్నా ఏడాదికి పైగా కష్టపడి జీరో సైజ్‌లోకి వచ్చేచింది. అలాగే త‌న ఫిజిక్ కోసం గంటల పాటు జిమ్‌లో కసరత్తు చేస్తునట్లు తెలుస్తుంది. తాజాగా ఆమె తన జిమ్‌కి సంబంధించిన ఓ వీడియోని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసింది. వీడియో ఆధారంగా ఆమె లోడింగ్ అంటూ క్యాప్షన్ ను జత చేసింది. ఈ వీడియోకు హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ స్పందిస్తూ లవ్ సింబల్‌ని కామెంట్‌గా పెట్ట‌డం విశేషం. ఇంకెందుకు ఆలస్యం రాశీఖ‌న్నా జిమ్ వీడియోను మీరు కూడా ఒక లుక్ వేయండి.