ర‌ష్మిక‌ను లైన్‌లో పెట్టిన `జాతిర‌త్నాలు` డైరెక్ట‌ర్‌?!

ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం తెలుగులోనే కాకుండా.. క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గుడుపుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ అమ్ముడు మ‌రో సినిమాకు ఒకే చెప్పింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. జాతిర‌త్నాలు సినిమాతో ఫామ్‌లోకి వ‌చ్చిన కేవీ అనుదీప్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని తమిళ హీరో శివ కార్తికేయ‌న్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

శివ కార్తికేయ‌న్‌కు ఇదే తొలి తెలుగు చిత్రం. సీనియ‌ర్ నిర్మాత‌లు నారాయ‌ణ్ దాస్ నారంగ్‌, పీ రామ్మోహ‌న్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా న‌టించాల‌ని ర‌ష్మికను సంప్ర‌దించి స్టోరీ నెరేట్ చేశాడ‌ అనుదీప్‌. అది న‌చ్చ‌డంలో వెంట‌నే ర‌ష్మిక గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే. కాగా, త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళంతో పాటు హిందీ, మలయాళ భాష‌ల్లోకూ తెర‌కెక్కించ‌నున్నార‌ని టాక్ న‌డుస్తోంది.

Share post:

Latest