కేటీఆర్‌ను సాయం అడిగిన ర‌ష్మి..దేనికోస‌మంటే?

బుల్లితెర అందాల యాంక‌ర్స్‌లో ఒక‌రైన ర‌ష్మి గౌత‌మ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపుల‌ర్ అయిన ఈ భామకు జంతువులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెపనక్కర్లేదు. మూగ జీవాలపై తన ప్రేమను చాటుతూ ఎప్ప‌టిక‌ప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతూనే ఉంటుంది.

అలాగే లాక్‌డౌన్‌లో వీధి కుక్క‌ల ఆక‌లి తీర్చి అంద‌రి మెప్పు పొందిన ర‌ష్మి.. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఓ సాయం కోరింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వీధికుక్కల సంఖ్యను తగ్గించేందుకు ఆ శునకాలకు వైద్య సిబ్బంది ఆపరేషన్‌ చేసి.. ఆ త‌ర్వాత ఇవ్వాల్సిన ట్రీట్‌మెంట్ ఇవ్వ‌కుండానే రోడ్ల‌పై వ‌దిలేస్తున్నారు.

అలాంటి శునకాల ఫొటోలను వివరాలతో సహా `సేవ్‌యానిమల్స్‌ఇండియా` అనే ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. ఇది గ‌మ‌నించిన ర‌ష్మి.. ఈ విష‌యంలో ఏదైనా పరిష్కార చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా కోరింది. ఈ క్ర‌మంలోనే కేటీఆర్‌ కార్యాలయ ఖాతాతో పాటు కేటీఆర్‌ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాను ట్యాగ్ కూడా చేసింది ర‌ష్మి. మ‌రి ఈ విష‌యంపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

https://twitter.com/rashmigautam27/status/1420692931778813953?s=20