డిటెక్టివ్‌గా మారబోతున్న‌ రాశీ ఖన్నా..వారికి పోటీ ఇస్తుందా?

క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు మూతప‌డ‌టంతో.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఆదరణ భారీగా పెరిగి పోయింది. విభిన్నమైన కాన్సెప్టులతో వెబ్‌సిరీస్‌లను రూపొందిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తున్నాయి ఓటీటీలు. దాంతో స్టార్ సెల‌బ్రెటీలు సైతం సినిమాల‌తో పాటుగా వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.

ఇప్ప‌టికే టాలీవుడ్‌లో త‌మ‌న్నా, కాజ‌ల్‌, స‌మంత వంటి తార‌లు డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చేశారు. ఇక ఇప్పుడు వీరి బాట‌లోనే అందాల భామ రాశీ ఖ‌న్నా కూడా న‌డుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్‌ వంటి ప్రతిష్టాత్మక వెబ్‌ సిరీస్‌ను తెర‌కెక్కించిన రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో రాశీ ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. అయితే ఇది ఇంకా పూర్తి కాకుండానే మ‌రో సిరీస్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింద‌ట‌.

సోనీ లివ్‌ ఓటీటీలో విడుదల కానున్న ఓ తెలుగు వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు రాశీ ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. సూర్య వంగల అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సిరీస్‌ను రూపొందించ‌నున్నాడు. ఈ సిరీస్‌లో ర‌శీ డిటెక్టివ్‌ పాత్రలో క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. ఇక మొత్తానికి స్టార్టింగ్‌లోనే జోరు చూపిస్తున్న రాశీ.. త‌మ‌న్నా, కాజ‌ల్‌, స‌మంత వంటి వారికి ఏ మాత్రం పోటీ ఇస్తుందో చూడాలి.

Share post:

Latest