రాజ‌కీయాల్లోకి ఎప్ప‌టికీ రాను..పార్టీని ర‌ద్దు చేసిన ర‌జ‌నీకాంత్‌!

గత తమిళనాడు ఎన్నికలకు ముందు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్టు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కానీ, అనారోగ్య కారణాలతో పొలిటికల్ ఎంట్రీ విష‌యంలో వెనక‌డుగు వేశారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ర‌జ‌నీ రాజ‌కీయాల్లో వ‌స్తున్నారంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే త‌న రాజ‌కీయ ఎంట్రీపై వ‌స్తున్న ఊహాగానాల‌కు ర‌జ‌నీకాంత్ తాజాగా ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. ఇవాళ అన్ని జిల్లాల‌కు చెందిన ర‌జినీ మ‌క్క‌ల్ మంద్రం ఆఫీసు బేర‌ర్‌ల‌తో భేటీ అయిన ర‌జ‌నీ.. భ‌విష్య‌త్తులో రాజ‌కీయ ప్ర‌వేశం చేయ‌బోన‌ని, అటువంటి ఆలోచ‌న కూడా లేద‌ని స్ప‌ష్టం చేసేశారు.

అంతేకాదు, రజినీ తన పార్టీని పూర్తిగా రద్దు చేస్తున్నానని, రజినీ మక్కల్ మండ్రం అనేది ఇకపై కేవలం అభిమాన సంక్షేమ సంఘంగానే ఉంటుందని తెలిపారు. కాగా, వైద్య ప‌రీక్ష‌ల కోసం జూన్ 19న భార్య లతాతో క‌లిసి రజనీకాంత్‌ కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. మ‌ళ్లీ ఇటీవ‌లె ర‌జ‌నీ చెన్నైకి తిరిగి వ‌చ్చారు.

Share post:

Latest