చివరి వరకు పోరాడిన తెలుగు తేజం.. హోరాహోరీ పోరులో సింధు ఓటమి

టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ సెమీస్‌లో తెలుగు తేజం పీవీ సింధు చివరి వరకు పోరాడింది. భారత్ తరఫున విజయ పతాకం ఎగురవేసేందుకు కృషి చేసింది. కానీ, చివరకు ఓటమి పాలైంది. చైనాకు చెందిన తై జు యింగ్, సింధు మధ్య తొలి సెట్ పోరు రసవత్తరంగా నడిచింది. మొదట్లో తై జుయింగ్ పై పీవీ సింధు ఆధిక్యం కనబరిచినప్పటికీ చివరలో వెనక పడింది. తొలి సెట్‌లో ఇద్దరు ప్లేయర్స్ పీవీ సింధు, తై జు య యింగ్ హోరాహోరీగా తలపడ్డారు. చివరగా 21-18 తేడాతో చైనాకు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ తై జు యింగ్ ఆధిక్యంలో వెళ్లింది. మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సింధు విజయం సాధిస్తుందని భారతీయులు ఆకాంక్షించారు. కానీ, ఓటమితోనే వెనుదిరిగింది.

- Advertisement -

కాగా, గతంలో అనగా 2016లో జరిగిన ఒలింపిక్స్ మ్యాచ్‌లో తై జు యింగ్‌ను బ్యాడ్మింటన్ గేమ్‌లో ఓడించి భారత్‌కు విజయం సాధించిపెట్టింది సింధు. ఈసారి మాత్రం ఓటమి పాలైంది.

Share post:

Popular