బాల‌య్య మూవీలో వంట‌ల‌క్క‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌?!

ప్రేమీ విశ్వనాథ్ అంటే గుర్తు ప‌ట్ట‌డం క‌ష్ట‌మేమోగానీ, వంట‌ల‌క్క అంటే దాదాపు అంద‌రికీ తెలుస్తుంది. కార్తీకదీపం సీరియల్‌లో వంటలక్క క్యారెక్టర్ చేస్తూ హీరోయిన్ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకుందీమె. బుల్లితెరపై వంట‌ల‌క్క ఎంట‌రైతే.. ఏ సీరియ‌ల్ అయినా, రియాలిటీ షో అయినా, చివ‌ర‌కు స్టార్ హీరో సినిమా అయినా సైడ్ అవ్వాల్సిందే.

అయితే కార్తీక‌దీపం సీరియల్‌తో వచ్చిన గుర్తింపుతో ప్రేమీకి వెండితెర‌పై సైతం అవ‌కాశాలు వెల్లువెత్తులున్నాయి. ఇటీవ‌ల రామ్ పోతినేని, లింగుసామి కాంబోలో తెర‌కెక్క‌బోయే సినిమాలో వంట‌ల‌క్క న‌టించ‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మ‌రో ఇంట్ర‌స్టింగ్ వార్త తెర‌పైకి వ‌చ్చింది.

ప్ర‌స్తుతం అఖండ సినిమా చేస్తున్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ.. ఆ త‌ర్వాత గోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర కోసం వంట‌ల‌క్కను తీసుకున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో హీరోయిన్ అక్క పాత్రకు ఎంతో ప్రాముఖ్య‌త ఉంటుంద‌ని.. ఆ పాత్ర కోస‌మే ప్రేమీని తీసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.

Share post:

Latest