బ్రేకింగ్ : ఫిలిప్ఫీన్‌లో ఘోర విమాన ప్రమాదం…!

ఈ మ‌ధ్య వ‌రుస ప్ర‌మాదాలు ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్నాయి. ఇక తాజాగా ఫిలిప్ఫీన్‌లో ఘోర విమాన ప్రమాదం క‌ల‌క‌లం రేపింది. ఇందులో దాదాపు 85 మంది ప్రయాణీకులతో వెళ్తున్న మిలటరీ ఫ్లైట్ ఆదివారం దక్షిణ ఫిలిఫ్పీన్‌లో ప్ర‌మాద వ‌శాత్తు కూలిపోయిందని ఆర్మీ చీఫ్ వివ‌రించారు. సి-130 అనేఏ విమానం కూలిన వెంటనే విప‌రీతంగా మంటలు వ్యాపించాయ‌ని, ఇందులో నుండి 15 మందిని కాపాడామ‌ని ఆర్మీ జనరల్‌ సిరిలిటో సోబెజానా స్ప‌ష్టం చేశారు.

ప్రావిన్స్‌లోని జోలో ఐలాండ్‌లో ఈ మిలిట‌రీ విమానం లాండ్ అవుతుండ‌గా ఈ ప్రమాదం జరిగిందని ఆయ‌న తెలిపారు. అక్క‌డే ఉన్న సహాయక సిబ్బంది ప్ర‌స్తుతం ఇంకా సహాయ చర్యలు చేపడుతున్నారని, మరి కొంత మందిని కాపాడేందుకు మ‌రిన్ని ప్రయత్నాలు చేస్తున్నార‌ని వివ‌రించారు. ప్రయాణీకుల్లో ఎక్కువ మంది ప్రాథమిక మిలటరీ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న వారే ఉన్నార‌ని, వారంతా ఉగ్రవాదంపై పోరాడే టాస్క్‌ పోర్స్‌లో భాగంగా ఐలాండ్‌కు తీసుకెళుతున్నట్టు వివ‌రించారు ఆయ‌న. కాగా ఎంత మంది గాయపడ్డారో ఇంకా తెలియ‌దు.

Share post:

Latest