పెళ్లి విష‌యంలో తాప్సీపై పేరెంట్స్ ఒత్తిడి..కార‌ణం అదేన‌ట‌?

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన తాప్సీ.. మొద‌టి సినిమాతోనే త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఈ చిత్రం త‌ర్వాత ప‌లు చిత్రాలు చేసిన తాప్సీ స‌రైన స‌క్సెస్ లేక‌పోవ‌డంతో.. బాలీవుడ్‌కు మ‌కాం మార్చేసి అక్క‌డ స్టార్ట్ హీరోయిన్‌గా ఎదిగింది.

ప్ర‌స్తుతం అక్క‌డ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న తాప్సీని త్వ‌ర‌గా పెళ్లి చేసుకోవాల‌ని ఆమె పెరెంట్స్ ఒత్తిడి చేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. దానికి కారణం ఆమె ఎక్కడ పెళ్లి చేసుకోకుండా ఒంట‌రిగానే ఉండిపోతుంద‌నే భయం వారిని వెంటాడుతుందట. అందుకే తాప్సీని న‌చ్చిన వాడిని వివాహం చేసుకోవాల‌ని కోరుతున్నార‌ట త‌ల్లిదండ్రులు.

కానీ, తాప్సీ చేతినిండా సినిమాలు ఉండ‌డంతో.. పెళ్లి విష‌యాన్ని ప‌క్క‌న పెడుతుంద‌ని టాక్‌. కాగా, విదేశీ బ్యాడ్మింటన్ ఆటగాడు, కోచ్ మథయాస్ బో ప్రేమలో తాప్సీ ఉన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి అత‌డినే తాప్సీ పెళ్లి చేసుకుంటుందా..?లేదా..? అన్న‌ది తెలియాల్సి ఉంది.