ఓటిటి వైపు అడుగులు వేస్తున్న నాగ చైతన్య….?!

కరోనా కారణంగా థియేటర్ లు మూతపడడంతో దానికి ప్రత్యామ్నయంగా హీరోలు ఓటిటి బాట పట్టారు. ఇక థియేటర్ లు ఓపెన్ చేసే దాక చూడడం కన్నా ఓటిటి ఫ్లాట్ఫారం వైపు అడుగులు వేయడం బెటర్ అనుకుంటున్నారు. తాజాగా అక్కినేని నట వారసుడు నాగచైతన్య కూడా ఈ వైపు అడుగులు వేస్తున్నాడు. ఏం మాయ చేసావే సినిమాతో మాయ చేసి లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతు వరుస సినిమాతో బిజీ బిజీగా ఉంటున్నాడు.

తాజాగా నాగ చైతన్య ప్రముఖ నిర్మాత శరత్ మరార్ తో ఓ స్టోరీ కోసం చర్చలు జరిపారు. వారి కాంబినేషన్ లో వచ్చే ఫిల్మ్ ఒరిజినల్ ఓటిటి చిత్రంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక స్క్రిప్ట్ లు సెలక్ట్ చేసుకొని ప్రస్తుతం దర్శకుని వేటలో ఈ ఇద్దరూ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నాగ చైతన్య ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ ..’థాంక్ యూ’ చిత్రాల్లో నటిస్తున్నాడు. అనంతరం బంగార్రాజు షూటింగ్ తో పాటుగా ఈ ఓటిటి చిత్రంకి సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు సమాచారం.

Share post:

Latest