ఓటిటీ లో తాప్సీ ‘హసీన్ దిల్ రూబా’ వచ్చేసింది..!

కరోనా సెకండ్ వేవ్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. ఇప్పుడిప్పుడే అన్నీ తెరుచుకుంటున్నాయి. షాపింగ్ మాల్స్, పెళ్లి మండపాలు, ఇలా ఒక్కోక్కటి తెరుచుకుంటూ వస్తున్నాయి. అయితే సినిమా థియేటర్లు మాత్రం ఇంకా తెరుచుకోనే లేదు. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ లిస్టులో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించకపోవడంతో ఆ సినిమాలన్నీ ఓటీటీలో విడుదలకు సన్నద్దమవుతున్నాయి.

తాజాగా ఓటీటీలో తాప్సీ నటించిన చిత్రం విడుదల అవ్వనుంది. తాప్సీ ముఖ్య పాత్ర పోషించిన హసీన్ దిల్ రూబా అనే సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారు. ఒకరితో ప్రేమ మరొకరితో రొమాన్స్ అనే కాన్సెప్ట్ పై సినిమా ఉండనుంది. బోల్డ్ సినిమాలో ఇప్పటికే చాలా రిలీజ్ అయ్యాయి. వాటికి క్రేజ్ ఉండటంతో ఈ చిత్రం కూడా అలాంటి కథాంశంతోనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని టీ సీరిస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్లలో రూపొందించారు. హిమాన్షు శర్మ, ఆనంద్ ఎల్.రాయ్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించగా వినీల్ మాథ్యూ డైరెక్ట్ చేశారు.

Share post:

Latest