“నవరస” ట్రైలర్ విడుదల..!

July 27, 2021 at 3:32 pm

ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ పట్ల జనాలు, నెటిజన్లు ఫుల్ అట్రాక్ట్ చేస్తున్నారు. వాటికి ఫుల్ డిమాండ్ ఉంది. ఇక డైరెక్టర్స్ కూడా సంప్రదాయ స్టోరీలను పక్కనబెట్టి డైనమిక్ అండ్ యూనిక్ ప్లస్ బోల్డ్ కంటెంట్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే అన్ని భాషల్లోనూ వెబ్ సిరీస్‌లు రూపొందుతున్నాయి. కాగా ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం క్రియేషన్‌లో వస్తున్న ‘నవరస’ భారీ తారగణంతో రూపొందుతోంది. ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్‌కు సంబంధించిన తాజాగా అప్‌డేట్ వచ్చింది.

అదే ట్రైలర్ రిలీజ్. తొమ్మిది రసాలను తొమ్మిది ఎపిసోడ్లుగా తీసుకొస్తుండగా వీటికి బెజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అరవింద్ స్వామి, కార్తీక్ సుబ్బరాజు, ప్రియదర్శన్, రతింద్రన్ ఆర్.ప్రసాద్, వసంత్ ఎస్.సాయి దర్శకత్వం వహించారు. ఇక రిలీజైన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా, వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ వెబ్ సిరీస్‌కు గోవింద్ వసంత మ్యూజిక్ అందిస్తున్నారు. ఆంథాలజీ డ్రామాగా వస్తున్న ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్లు, పాటలు, ఇంట్రడక్షన్ వీడియోలు విడుదల చేయగా, అవి నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

“నవరస” ట్రైలర్ విడుదల..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts