నెట్‌ఫ్లిక్స్ లో `న‌వ‌ర‌స‌`.. ఇంట్ర‌స్టింగ్‌గా టీజ‌ర్‌!

ఏస్ డైరెక్టర్‌ మ‌ణిర‌త్నంతో పాటు ప్రముఖ రైట‌ర్, ఫిల్మ్ మేక‌ర్ జ‌యేందర్‌ పంచ‌ప‌కేశ‌న్ స‌మ‌ర్పణలో తెర‌కెక్కిన తాజా వెబ్‌సిరీస్ న‌వ‌ర‌స‌. మొత్తం తొమ్మిది ఎపిసొడ్ లతో రానున్న ఈ వెబ్ సిరీస్ కి గౌతమ్ వాసుదేవ్ మీనన్, వెంకట్, బెజాయ్ నంబియార్, కార్తిక్ సుబ్బరాజు, అరవింద్ స్వామి, సర్జున్, కార్తిక్ నరేన్, ప్రియదర్శన్, వసంత్, రతింద్రన్ లు దర్శకత్వం వహించారు.

మద్రాస్ టాకీస్ మరియు క్యూబ్ టెక్నాలజీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో సూర్య, సిద్ధార్థ్‌, ప్రకాశ్‌రాజ్‌, విజయ్‌ సేతుపతి, రేవతి, ఐశ్వర్యరాజేశ్‌, అరవింద్‌ స్వామి, రోబో శంకర్‌, యోగిబాబు త‌దిత‌రులు ఈ సిరీస్‌లో న‌టించారు.

తాజాగా ఈ సిరీస్ టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా..సిరీస్ పేరుకు తగ్గట్లే నటుల చేత నవరసాలను పలికిస్తూ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. మొత్తానికి సూప‌ర్ ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్న ఈ టీజ‌ర్‌.. సిరీస్‌పై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. కాగా, ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ఆగస్ట్ లో 6న విడుద‌ల కానుంది.

Share post:

Latest