సరి కొత్త లుక్ తో నారా రోహిత్..!

బాణం సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన నారా రోహిత్ సోలో సినిమాతో లవర్ బోయ్ గా పేరు తెచ్చుకున్నారు. రోహిత్ ‘రౌడీ ఫెలో’ సినిమాలో విభిన్నమైన నటనా ప్రదర్శన కనబరిచి అభిమానులను బాగా అలరించారు. ఆయన తన కెరీర్ లో పలు ఫ్లాపులు చవి చూశారు కానీ డిఫరెంట్ స్క్రిప్టులతో సినిమాలు తీయడానికి మాత్రం ఇప్పటికీ వెనకాడటం లేదు. ఇప్పుడు ఆయన శబ్దం, మద్రాసి అనే సినిమాల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే, 2018 తర్వాత ఆయన ఏ చిత్రంలోనూ కనిపించలేదు. దీంతో ఆయన అభిమానులు నిరాశలో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఆయన కొత్త లుక్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. ఈరోజు అనగా జులై 25 వ తేదీన ఆయన తన 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తన స్మార్ట్ లుక్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రోహిత్ నెక్స్ట్ సినిమాలతో తమను పూర్తిస్థాయిలో ఎంటర్టైన్ చేస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తదుపరి సినిమాలతో ఆయన మంచి విజయాలను సాధించాలని ఆశిద్దాం.