ఎన్టీఆర్ తో గ్యాప్ పై రాజీవ్ కనకాల ఏమి అన్నారంటే..?

July 25, 2021 at 12:44 pm

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్‌లో ఒకరు రాజీవ్ కనకాల. ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో దాదాపు చక్కటి పాత్రల్లో కనిపించాడు రాజీవ్. ఇక వీరిరువురు ఇంకొంత మంది స్నేహితులు కలిసి హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటారట. అయితే, రాజీవ్ కనకాల, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉన్నట్లు వార్తలు రాగా, వాటిపై క్లారిటీ ఇచ్చాడు రాజీవ్. తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో గ్యాప్ గురించి వివరించాడు. ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి తెలిపాడు రాజీవ్.

ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్‌కు ఎంతో వాల్యూ ఇస్తాడని చెప్పాడు. కాగా, తారక్‌కు మ్యారేజ్ అయినప్పటి నుంచి కాస్త గ్యాప్ వచ్చిందని, పెళ్లి తర్వాత కూడా తాను తారక్‌తో 24 గంటలు ఉండటం కుదరదు కదా అని వివరించాడు రాజీవ్. అయితే, వీలు కుదిరినప్పుడల్లా కలుస్తుంటానని పేర్కొన్నాడు. ఎన్టీఆర్ నటించిన ‘స్టూడెంట్ నెం.1, యమదొంగ, ఆది, నాగ, బాద్ షా, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు రాజీవ్ కనకాల. ఇక జక్కన్న దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లోనూ రాజీవ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివతో పాన్ ఇండియా ప్రాజెక్టు చేయబోతున్నారు.

ఎన్టీఆర్ తో గ్యాప్ పై రాజీవ్ కనకాల ఏమి అన్నారంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts