ఈ నంద‌మూరి హీరో సినిమాలు ఎందుకు మానేశాడో తెలుసా..?

తెలుగు తెర‌పై ఎంతో మంది త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకుని స‌త్తా చాటారు. అనేక మంది ఎలాంటి స‌పోర్టు లేకుండా ఇండ‌స్ట్రీలో రాణించి స్టార్ హీరోలుగా ఎదిగారు. అలాంటి కుటుంబాల్లో నంద‌మూరి కుంటుంబం కూడా ఒక‌టి. ఆ ఇంటి నుంచి వ‌చ్చిన ఎంతో మంది హీరోలుగా రాణించారు. కానీ ఓ హీరో మాత్రం ఎంతో కాలం నిల‌బ‌డ‌కుండానే తెర‌కు దూర‌మ‌య్యాడు.

ఆయ‌నెవ‌రో కాదు విశ్వ విఖ్యాత‌గా పేరు గాంచిన నందమూరి తారక రామారావు తమ్ముడు త్రివిక్రమ రావు కొడుకు అయిన క‌ళ్యాణ్ చక్ర‌వ‌ర్తి. ఆయ‌న నంద‌మూరి ఫేమ్‌తో ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా కూడా త‌న న‌ట‌న‌తోనే అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాడు. కోడి రామకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తీసిన‌ అత్తగారు స్వాగతం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న త‌ర్వాత రౌడీ బాబాయ్ మూవీ అలాగే ప్రేమ కిరీటం సినిమాల్లో న‌టించి త‌న స‌త్తా ఏంటో నిరూపించారు. అయితే 2003లో వ‌చ్చిన కబీర్ దాస్ సినిమా త‌ర్వాత ఆయ‌న న‌టించ‌లేదు. కార‌ణం ఆయ‌న కొడుకు, త‌మ్ముడు, రోడ్డు ప్ర‌మాదంలో చనిపోవడంతో ఆయ‌న షాక్‌లోకి వెళ్లిపోయారు. ఇక త‌న తండ్రి కూడా తీవ్ర గాయాల పాలు కావ‌డ‌తో ఆయ‌న సినిమాలు మానేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న చెన్నైలోనే ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు.

Share post:

Popular