నితిన్ సినిమాపైనే ఆశ‌ల‌న్నీ పెట్టుకున్న ఇస్మార్ట్ పోరి?!

ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఇస్మార్ట్ పోరిగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న న‌భా న‌టేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత ఈ అమ్మ‌డు డిస్కోరాజా, సోలోబ్రతుకే సో బెటర్ చిత్రాల్లో న‌టించింది. కానీ, ఈ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా స‌త్తా చూప‌లేక‌పోయాయి.

Nitin 'Maestro' movie into OTT .. Movie unit in discussions? -

ఇక ప్ర‌స్తుతం న‌భా నితిన్ నటిస్తున్న మాస్ట్రో సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అందుకున్న అంధాదున్‌కు రీమేక్ ఇది. ఇందులో త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రేష్ఠ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

Nithiin Maestro Shooting Completed

అయితే వినిపిస్తున్న లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. న‌భా ఆశ‌ల‌న్నీ మాస్ట్రోపైనే పెట్టుకుంద‌ట‌. ఎందుకంటే, ప్ర‌స్తుతం ఈ బ్యూటీకి ఆఫర్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒక‌వేళ మాస్ట్రో సూప‌ర్ హిట్ అయితే.. న‌భాకు అవ‌కాశాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే మాస్ట్రోతో హిట్ కొట్టాల‌ని న‌భా ఆరాట‌ప‌డుతుంద‌ట‌.