మోహన్‌లాల్ తో ఛాన్స్ కొట్టేసిన మీనా..?

దృశ్యం సినిమాలో మోహన్ లాల్ తో జోడీ కట్టి హిట్ కొట్టిన సీనియర్ నటి మీనా మరోసారి ఆయనతో నటించేందుకు ఛాన్స్ కొట్టేసింది. మలయాళంలో మోహన్ లాల్, మీనాలకు సూపర్ జోడిగా పేరుంది. ఇప్పటికే పలు హిట్ సినిమాలు చేసిన ఈ జంట తాజాగా మరోసారి తెరపైకి రానున్నారు.

ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌లో పృధ్వీరాజ్ డైరెక్ట్ చేస్తున్న ‘బ్రో డాడీ’ సినిమాలలో వీరిద్దరూ జతకట్టనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ ఫిల్మ్ ని ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమయ్యింది. అయితే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టు మీనా తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ సినిమాలో పృధ్వీరాజ్, కళ్యాణీ ప్రియదర్శన్, లాలు అలెక్స్, మురళీ గోపి, సౌబిన్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మీనా మోహన్ లాల్ సరసన నటిస్తుందా లేదా ఏదైనా రోల్ చేస్తుందా అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

Share post:

Popular