రోజాకి షాక్ ఇచ్చిన సీఎం జగన్..?

వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజాకు షాక్ తగిలింది. సీఎం జగన్ ఆమెకు ఝలక్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లి అక్కడ ఫైర్ బ్రాండ్‌గా ఎమ్మెల్యే రోజా పేరు తెచ్చుకుంది. జగన్ మంత్రి వర్గంలో మంత్రిగా కొలువు తీరాలనుకుంది. కానీ, ఆశించిన మంత్రి పదవి దక్కలేదు. తర్వాత ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయిష్టంగానే ఆ పదవిని నిర్వహిస్తూ వస్తోంది రోజా. తాజాగా ఆమెకు ఆ పోస్టు కూడా ఊస్టింగ్ అయింది.

ఏపీఐఐసీ చైర్మన్ పోస్టును వేరే వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి. కొంత కాలంగా పార్టీలో రోజాకు పొగ పెడుతున్నారనే ప్రచారం సాగుతుండగా.. అందుకు అనుగుణంగా ఈ నిర్ణయం ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. రోజా కొంత కాలంగా పార్టీలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? అని పార్టీ కార్యకర్తలు, నేతలు చర్చించుకుంటున్నారు. రోజాకు పార్టీలోనే ప్రత్యర్థి వర్గం ఉండి పావులు కదపడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share post:

Latest