మ‌హేష్‌తో సినిమా..సీక్రెట్ రివిల్ చేసిన మణిరత్నం!

విభిన్న‌మైన చిత్రాల‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుని సినీ ప‌రిశ్ర‌మ‌లో డైరెక్ట‌ర్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు మణిరత్నం. ఆయన సినిమాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే అంద‌రూ ఆయ‌న చిత్రాల‌కు ఫిదా అవుతుంటారు.

ఇదిలా ఉంటీ.. ఆ మ‌ధ్య మ‌ణిర‌త్నం మ‌హేష్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు, మ‌హేష్‌ను మ‌ణిర‌త్నం క‌లిసి క‌థ చెప్పార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న మ‌ణిర‌త్నం.. ఈ విష‌యంపై స్పందించారు.

మ‌హేష్‌తో సినిమా చేయాల‌నుకున్న‌ది నిజమేనని మ‌ణిర‌త్నం తెలిపారు. ఒక కథ విషయంలో మహేష్‌ ను కలిసి మాట్లాడటం జరిగిందనీ, అయితే కొన్ని కారణాల వలన అది వర్కౌట్ కాలేదని సీక్రెట్ రివిల్ చేశారు. ఇక నేరుగా తెలుగులో ఒక సినిమా చేసే ఆలోచన ఉందని, మ‌రి ఆ స‌మ‌యం ఎప్పుడు వ‌స్తుందో వేచి చూడాల‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

Share post:

Latest