సీనియర్ హీరో మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం లక్ష్మి సినిమాలు చేయకపోయినా.. టీవీ షోలతో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడ ఈ అమ్మడు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం వంటలక్కగా మారింది.
![‘ఆహా’లో ఓటీటీలో తొలి సీజన్లో ప్రసారమయ్యే ఫస్ట్ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది. ఈ ఫస్ట్ ఎపిసోడ్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ .. మంచు లక్మితో కలిసి కొన్ని రెసిపీలు చేయబోతున్నాడు. ఇంతకీ ఆహా భోజనంబులో ప్రేక్షకులకు ఎలాంటి వంటకం రుచి చూసిస్తారో చూడాలి. (Twitter/Photo),[object Object]](https://images.news18.com/telugu/uploads/2021/07/Manchu-Lakshmi-With-Vishwak-Sen-News18-4.jpg)
కొత్త కంటెంట్‌తో పాటు సరికొత్త షోలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆహ.. త్వరలోనే `ఆహా భోజనంబు` అంటూ వంటల ప్రోగ్రామ్‌తో రాబోతోంది. ఈ ప్రోగ్రామ్‌కు మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఇందులో సెలబ్రెటీల చేత లక్ష్మి వంటలు చేస్తూ, చేయిస్తూ.. వారితో మాట్లాడనుంది. త్వరలోనే ఈ ప్రోగ్రామ్ ఆహాలో అందుబాటులోకి రానుంది.

అయితే తాజాగా మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. వాటి బట్టీ.. ఆహా భోజనంబు ప్రోగ్రామ్‌కు ఫస్ట్ గెస్ట్‌గా యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వచ్చినట్టు.. అతడితో మంచు వారి అమ్మాయి రచ్చ రచ్చ చేసినట్టు స్పష్టంగా అర్థం అవుతోంది. మరి ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.



