ఆ స్టార్ హీరోతో `జాతిరత్నాలు` డైరెక్ట‌ర్ నెక్స్ట్ ప్రాజెక్ట్!

పిట్టగోడ సినిమాతో ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన కెవి. అనుదీప్.. జాతిర‌త్నాలు సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీల‌క పాత్ర‌ల్లో ఫుల్‌ లెన్త్‌ కామెడీగా తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది.

- Advertisement -

Sivakarthikeyan to forego remuneration for Ravikumar's sci-fi film -  Hindustan Times

ఇక ఈ చిత్రం త‌ర్వాత అనుదీప్ ఏ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారిన త‌రుణంలో.. తమిళ స్టార్‌ హీరో శివ కార్తికేయన్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఈ మ‌ధ్యే అనుదీప్ కార్తికేయ‌న్‌కు ఓ మంచి క‌థ చెప్పి.. సినిమా చేసేందుకు ఒప్పించాడ‌ట‌.

వీరి కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యాన‌ర్‌పై నారాయన్‌ దాస్‌ నారంగ్ నిర్మించ‌నున్నార‌ట‌. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. కాగా, శివ కార్తికేయన్ కు ఇదే తొలి తెలుగు చిత్రం.

Share post:

Popular