సూప‌ర్ థ్రిల్లింగ్‌గా అమ‌లాపాల్ `కుడి ఎడమైతే` టీజ‌ర్‌!

అమలాపాల్‌, రాహుల్‌ విజయ్ కీల‌క పాత్ర‌ల్లో యూ టర్న్ ఫేమ్ ప‌వ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా వెబ్ సిరీస్ కుడి ఎడమైతే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సిరీస్ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుద‌ల కానుంది. ఇటీవ‌ల విడుద‌లైన మోషన్‌ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

అయితే తాజా ఈ సిరీస్ టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మీకెప్పుడైనా లైఫ్ లో జరిగిందే మళ్ళీ మళ్ళీ జరిగినట్లు అనిపించిందా? అనే డైలాగ్ తో ప్రారంభ‌మైన ఈ టీజ‌ర్ ఆధ్యంతం సూప‌ర్ థ్రిల్లింగ్‌గా కొన‌సాగింది. భిన్నమైన రంగాలకు చెందిన ఈ ఇద్దరు వ్యక్తుల జీవితాలను ప్యారలాల్ గా చూపిస్తూ ఓ యాక్సిడెంట్ కి గురైనట్లు టీజర్ లో చూపించారు.

మొత్తానికి అద్భుతంగా ఉన్న ఈ టీజ‌ర్ సిరీస్‌పై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ఈ సిరీస్‌లో అమ‌లా పాల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా..రాహుల్ విజ‌య్ డెలివ‌రీ బాయ్ పాత్ర‌లో క‌నిపించారు. కాగా, ఈ సైంటిఫికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ జూలై 16 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Share post:

Latest