పని లేని వాళ్ళే బిగ్‌బాస్‌కు వెళ్తారు..కోటా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌సారం అవుతున్న అన్ని భాష‌ల్లోనూ ఈ షో సూప‌ర్ హిట్‌గా నిలిచింది. తెలుగులోనూ మంది ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న ఈ షో.. ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే ఐదో సీజ‌న్ కూడా ప్రారంభం అవ్వ‌నుంది.

ఇలాంటి త‌రుణంలో విల‌క్షణ న‌టుడు కోట శ్రీనివాస‌రావు బిగ్ బాస్ షోపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కోటా బిగ్ బాస్ షోపై స్పందిస్తూ.. తాను ఎప్పుడూ ఆ షో చూడనని.. పని లేని వాళ్ళు వంద రోజులు అక్కడ ఉండడానికి వెళ్తారని.. ఇంట్లో పనిలేని వాళ్ళు ఆ షో చూస్తారని అసలు తాను ఆ షో చూడనని అన్నారు.

అసలు ఆ షో లో ఏముంటుంది..? అదేమన్నా ప్రపంచానికి పనికి వచ్చేదా..? అంటూ కోటా ప్ర‌శ్నించారు. దాంతో ఈయ‌న వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక కోటా వ్యాఖ్య‌ల‌కు కొంద‌రు మ‌ద్ద‌తు ప‌లుకుతుంటే.. మ‌రికొంద‌రు మాత్రం భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.