రియల్ లైఫ్‌లో వంట‌ల‌క్క‌కు ఎంత మంది పిల్ల‌లున్నారో తెలుసా?

బుల్లితెర‌ టాప్ సీరియ‌ల్‌ కార్తీకదీపం ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన వంట‌ల‌క్క అస‌లు పేరు ప్రేమీ విశ్వనాథ్. మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగులో హీరోయిన్ రేంజ్ ఫాలోంగ్ సంపాదించుకున్న ప్రేమి.. త్వర‌లోనే వెండితెర‌పై కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది.

ఇక ప్రేమి విశ్వనాథ్ రియ‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. ఆమె భర్త పేరు డాక్టర్ టి ఎస్ వినీత్ భట్. ఈయ‌న ఇండియలోనే ఫేమస్ ఆస్ట్రాలజర్‌. ఈ దంప‌తుల‌కు ఓ బాబు కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని ప్రేమినే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తాను షూటింగ్స్‌తో.. తన భర్త టూర్స్‌తో బిజీగా ఉంటామని.. దాంతో పిల్లాడి బాధ్యత అంతా వాళ్ల అమ్మమ్మ చూసుకుంటుందని వంట‌ల‌క్క ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ప్ర‌స్తుతం ప్రేమి తన భర్తతో కలిసి ఎర్నాకుళంలో నివసిస్తోంది.

Share post:

Latest