విజయ్ దళపతి స‌మ‌క్షంలో జానీ మాస్టర్ బ‌ర్త్‌డే వేడుక‌లు..పిక్స్ వైర‌ల్!

ద‌ళ‌ప‌తి విజ‌య్ తాజా చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇది విజయ్‌కు 65వ చిత్రం. స‌న్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని రూ. 120 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Image

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ చెన్నై లో మొదలైంది. ముందుగా విజయ్- పూజా లపై సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఈ పాటకు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేయనున్నారు. అయితే తాజాగా సెట్ లో ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌మ‌క్షంలో జానీ మాస్టర్ పుట్టిన రోజును సెలబ్రేట్ చేశారు చిత్ర యూనిట్‌.

Image

ఈ సందర్భంగా జానీ మాస్టర్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తే.. విజ‌య్‌తో దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దాంతో ఇప్పుడా ఈ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. కాగా, స్టైలిష్‌ స్టెప్పులతో అలరిస్తున్న జానీ మాస్టర్ త్వ‌ర‌లోనే హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న హీరోగా ఓషో తులసీరామ్ దర్శకత్వంలో దక్షిణ అనే చిత్రం తెరకెక్కుతోంది.

Share post:

Latest