బాలీవుడ్‌కు `జనతా గ్యారేజ్`..హీరో ఎవ‌రో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో వ‌చ్చిన చిత్రం జ‌న‌తా గ్యారేజ్‌. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించగా.. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్‌గా న‌టించారు. 2016లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది.

బాక్సాఫీస్ వంద కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు బాలీవుడ్‌కు వెళ్ల‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమా చేయనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగ‌తి తెలిసిందే.

Salman Khan touches on 'accepting' one's own mistakes

అయితే ఈ సినిమా ఏదో కాద‌ట‌.. జ‌న‌తా గ్యారేజ్ రీమేక్‌నే అని టాక్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే ఈ మూవీ కోసం స‌ల్మాన్‌కు మైత్రీ వారు అడ్వాన్స్ కూడా ఇచ్చారని, 2023 లో ఈ ప్రాజెక్ట్ మొదలవనుందని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే.. అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Share post:

Latest