భారత్-శ్రీలంక సిరీస్ రీషెడ్యూల్ డేట్స్ ఇవే..!

భారత్, శ్రీలంక మధ్య జరిగే వన్డే క్రికెట్ సిరీస్, టీ20 సిరీస్‌ల ప్రారంభ తేదీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఐతే జులై 13వ తేదీ నుంచి స్టార్ట్ కావాల్సిన వన్డే సిరీస్ నాలుగు రోజులు ఆలస్యంగా అనగా జూలై 17నుంచి ప్రారంభం కానుంది. ఫస్ట్ వన్డే 17న, సెకండ్ వన్డే 19న, మూడో వన్డే 21న జరగనుంది. జూలై 24న ఫస్ట్ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. 25న రెండో టీ20, 27న మూడో టీ20 జరగనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లన్నీ కొలంబోలో జరగనున్నాయి. కాగా ప్రస్తుతం ఇరుజట్ల ప్లేయర్లు కొలంబోలోని హోటల్లో క్వారంటైన్ లో ఉన్నారు.

అయితే ఈ సిరీస్ మ్యాచులకు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఈ సిరీస్‌కు రాహుల్ ద్రావిడ్‌ను భారత జట్టు కోచ్‌గా నియమించారు. ఈ సిరీస్ కోసం చాలా మంది యువ క్రికెటర్లను ఎంపిక చేసుకున్నారు. శిఖర్ ధావన్ కెప్టెన్ గా, భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనుండగా.. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య నితీశ్ రాణా వంటి యువ ప్లేయర్లు ఈ సిరీస్ కి ఎంపికయ్యారు.