భారీ రేటుకు అమ్ముడైన `గ‌ని` ఆడియో రైట్స్‌!

మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప‌దొవ చిత్రం గ‌ని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అలాగే ఈ చిత్రంలో క‌న్నడ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్డేట్‌ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ రేటుకు అమ్ముడ‌య్యాయ‌ట‌.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. లహరి మ్యూజిక్ ఏకంగా 1.5 కోట్లకు గ‌ని ఆడియో రైట్స్‌ను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ మ‌ధ్యే గ‌ని డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా 24 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.