రుమేర్స్ కి చెక్ పెట్టిన త్రిష..?

పదేళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగిన స్టార్ హీరోయిన్ త్రిష ఇప్పుడు పెళ్ళికి సిద్దమయ్యిందా..? ఓ తమిళ డైరెక్టర్ ను ఆమె పెళ్లి చేసుకోబోతుందా..? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలే తమిళ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో హీరోయిన్ త్రిష పెళ్లి పై చాలా పుకార్లు వచ్చాయి. కానీ వాటిని ఆమె కొట్టిపడేశారు. నిజానికి కొనేళ్ల క్రితం వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌ తో త్రిషకు ఎంగేజ్‌మెంట్ అయ్యింది.

ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ, ఆ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత త్రిష మళ్ళీ పెళ్లి గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‌గా కొనసాగిన త్రిష‌కు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు అయితే లేవు. అందువల్ల ఈ రూమర్ ముందుకు వచ్చిందా..? అసలు ఇందులో నిజం ఉందా..లేక ఇది కూడా రూమరేనా..? అనేది తెలియదు. ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో సర్క్యూలేట్ అవుతున్న ఈ వార్తపై త్రిష ఏం క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Share post:

Popular