ఎంఎస్ ధోనీ అభిమానులకు శుభవార్త..!

మాజీ టీమిండియా ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ గురించి క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీమిండియా జట్టునును నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ధోనీ. ప్రస్తుతానికి మాత్రం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను కూడా అన్ని రంగాల్లో ముందు ఉండేలాగా వేయవహరిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఇటీవల ఐపీఎల్ నుంచి కూడా ధోనీ తప్పుకుంటాడనే వార్తలు వచ్చాయి.. అయితే ఈ విషయంపై చైన్నై టీం మేనేజ్‌మెంట్ స్పందిస్తూ.. మా కెప్టెన్ ధోనీనే అని సోషల్ మీడియా వేదికగా తెలియచేసింది. మరో రెండు సంవత్సరాల పాటు సీఎస్కే సారథ్య బాధ్యతలు ధోనీనే ఉంటారు అని తెలియచేసింది. దీంతో ధోనీ అభిమానులతో పాటు సీఎస్‌కే ఫ్యాన్స్ అందంలో మునిగి తేలుతున్నారు. అయితే యూఏఈ లో జరగబోయే ఐపీఎల్ 2021లోనూ ధోనీనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో వాయిదా పడిన మ్యాచులను తిరిగి మళ్ళి మొదలు అవ్వబోతున్నాయి.

Share post:

Latest