ఓటీటీలో రానా `విరాటపర్వం`..క్లారిటీ ఇచ్చేసిన డైరెక్ట‌ర్‌!

రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం విరాట‌ప‌ర్వం. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి, నందితా దాస్, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఎస్.ఎల్.వి సినిమాస్- సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే విరాట‌ప‌ర్వం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల కానుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ విష‌యంపై తాజాగా డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని స్ప‌ష్టం చేశారు.

అలాగే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనే పట్టుదలతోనే నిర్మాతలు ఉన్నారనీ, థియేటర్లు ఓపెన్ అయిన తరువాత, పరిస్థితులు చూసుకుని రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టిస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. మ‌రి ఇప్ప‌టికైనా విరాట‌ప‌ర్వం విడుద‌ల‌పై వ‌స్తున్న రూమ‌ర్స్ ఆగుతాయో..లేదో..చూడాల్సి ఉంది.

Share post:

Latest