దిల్‌రాజు నిర్మాణంలో క‌ళ్యాణ్ రామ్ కొత్త సినిమా..డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

నందమూరి నట వారసుడు కళ్యాణ్ రామ్ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఆయ‌న‌తో వ‌రుస సినిమాలు ప్ర‌క‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సొంత బ్యాన‌ర్‌లో 18వ సినిమాగా బింబిసార చేస్తున్న క‌ళ్యాణ్ రామ్‌.. త‌న 20వ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో ప్ర‌క‌టించాడు.

ఈ చిత్రానికి కేవి గుహాన్ దర్శకత్వం వహించనున్నారు. కళ్యాణ్ రామ్ తో #NKR20 తో సినిమా ను తెరకెక్కించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్ అంటూ ఉన్న పోస్టర్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ క‌ళ్యాణ్ రామ్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలియజేశారు.

Image

ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, శిరీష్ లు సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. కాగా, క‌ళ్యాణ్ రామ్ 19వ సినిమా మైత్రీ మూవీస్ బ్యానర్‌లో రానుంది. అలాగే 21వ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఈ రోజే రానుంది.

Share post:

Latest