తెర‌పైకి `దాస‌రి` బ‌యోపిక్‌..డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

దివంగ‌త దర్శకుడు, రచయిత, నిర్మాత, న‌టుడు, రాజకీయనాయకుడు దాసరి నారాయణరావు అంటే తెలియ‌ని వారుండ‌రు. ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడిగా గిన్నిస్ బుక్‌లో స్థానం ద‌క్కించుకున్న దాస‌రి.. మంచి న‌టుడుగానూ ఫ్రూవ్ చేసుకున్నారు. మ‌రోవైపు రాజకీయాల్లోనూ రాణించి త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

అటువంటి గొప్ప వ్య‌క్తి జీవిత కథను బయోపిక్‌గా తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు ధవల సత్యం ఈ సినిమాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఇమేజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై తాడివాక రమేష్‌ నాయుడు నిర్మించ‌నున్నారు.

ఈ చిత్రానికి `దర్శకరత్న` అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంతో దాస‌రి పాత్ర ఓ ప్ర‌ముఖ హీరో న‌టించ‌నున్నాడ‌ని స‌మాచారం. ఇక త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ప్రకటించబోతున్నారు.

Share post:

Popular