ఆ హీరోయిన్‌నే కావాలంటున్న చిరు..మ‌రి గ్రీన్‌సిగ్నెల్ ఇస్తుందా?

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత మ‌ల‌యాళంలో హిట్ అయిన లూసీఫ‌ర్ రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఒరిజిన‌ల్‌లో హీరోయిన్ పాత్ర లేదు. కానీ, తెలుగు వ‌ర్షెన్‌లో మాత్రం మోహ‌న్ రాజా హీరోయిన్ పాత్ర‌ను యాడ్ చేశారు.

Nayanthara's crucial role in Chiranjeevi's Lucifer - tollywood

ఇక ఆ పాత్ర కోసం లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తారను తీసుకోవాల‌ని చిరు ద‌ర్శ‌కుడికి సూచించ‌డంతో.. ఆయ‌న న‌య‌న్‌ను సంప్ర‌దించార‌ట‌. కానీ, ఆమె నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని టాక్. ఈ నేపథ్యంలోనే మోహ‌న్ రాజా మ‌రో హీరోయిన్‌ను వేతికే ప‌నిలో ప‌డ్డార‌ట‌.

Nayanthara to join Chiranjeevi and Mohan Raja in the Telugu remake of  Lucifer | Tamil Movie News - Times of India

అయితే చిరు మాత్రం న‌య‌న్‌నే తీసుకురావాల‌ని ప‌ట్టు బ‌ట్టిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. చిన్న పాత్రే అయిన‌ప్ప‌టికీ.. ఆమెనే ఆ రోల్‌కు క‌రెక్ట్‌గా సెట్ అవుతుంద‌ని చిరు భావిస్తున్నార‌ట‌. మ‌రి న‌య‌న్ గ్రీన్ సిగ్నెల్ ఇస్తుందో..లేదో..చూడాలి. కాగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, ఎన్వీఆర్ సినిమా బ్యానర్లపై రామ్ చరణ్, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Share post:

Latest