క్యాస్టింగ్‌ కౌచ్‌ పై స్పందించిన నటి శ్వేతా వర్మ..?

ఇండ‌స్ట్రీని ప‌ట్టిపీడిస్తున్న వాటిల్లో క్యాస్టింగ్‌ కౌచ్ ప్ర‌ధానంగా ఉంటోంది. సినిమాల్లో అవకాశం కోసం వ‌చ్చిన ఎంతో మంది అమ్మాయిల‌కు ఇది పెద్ద సమస్యగా మారింది. సినిమాల్లో ఛాన్సుల కోసం చాలామంది హీరోయిన్లు ఒక‌ప్పుడు గొంతెత్తి అడిగేవారు కాదు. కానీ ఇప్పుడు అలాంటి రోజులు పోయాయి. ఈ సమస్యను ఎదుర్కొంటున్న ప్రతి హీరోయిన్ కూడా ధైర్యంగా అన్యాయాల గురించి చెబుతున్నారు. ఎంతోమంది పేర్లు అప్ప‌ట్లో బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇక తాజాగా పచ్చీస్‌, సైకిల్ లాంటి వాటిల్లో నటించిన శ్వేతా వర్మ ఇప్పున‌డు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు.

తాను ఓక సినిమా ఆఫీస్‌కి వెళ్తే రూ.20 కోట్లు విలువ గల విల్లా ఉన్న ప్రొడ్యూస‌ర్ కు కమిట్‌మెంట్‌ ఇస్తారా అని ఓ డైరెక్ట‌ర్ నేరుగా అడిగాడ‌ని తెలిపింది. అయితే ఆ డైరెక్ట‌ర్‌కు మాత్రం అలాంటి ఆలోచన లేద‌ని, ఆ నిర్మాత కోసం మాత్రం స‌ద‌రు ద‌ర్శ‌కుడు అలా అడగడం ఆశ్చర్యం క‌లిగించింద‌ని శ్వేతా వివ‌రించింది. కానీ తాను మాత్రం ట్యాలెంట్‌ను నమ్ముకుని వచ్చాన‌ని, ఇప్ప‌టికీ అడ్డదారుల్లో వెళ్లాలనుకోవ‌ట్లేద‌ని తెలిపింది.