బాలీవుడ్ లోకి తమిళ బ్లాక్ బస్టర్..?

విజయ్‌ సేతుపతి, మాధవన్ హీరోలుగా న‌టించిన కోలీవుడ్ మూవీ “విక్రమ్‌ వేదా” 2017 లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయింది. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. హృతిక్ రోష‌న్‌, సైఫ్ అలీఖాన్ హీరోలుగా న‌టించ‌బోతున్న ఈ హిందీ సినిమాని సెప్టెంబర్‌ 30, 2022న రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ప్రొడ్యూసర్లు పక్క ప్లాన్ కూడా రూపొందించారని తెలుస్తోంది. ప్రస్తుతం హృతిక్‌ ‘ఫైటర్‌’ సినిమా షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నారు. ఫైటర్‌ చిత్రాన్ని సెప్టెంబర్‌ 30, 2022న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు కానీ ఇందులో భారీ యాక్షన్‌ సన్నివేశాలు షూట్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ ని వాయిదా వేయాలని చిత్రబృందం భావిస్తోంది.

అయితే ఆ ముహూర్తంలోనే విక్ర‌మ్‌ వేదా హిందీ రీమేక్ని విడుద‌ల చేద్దామ‌ని నిర్మాత‌లు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. హృతిక్ రోష‌న్‌, సైఫ్ అలీఖాన్ త్వ‌ర‌లోనే సెట్స్ లో జాయిన్ కానున్నారు. ఒరిజినల్ మూవీ ని డైరెక్ట్ చేసిన పుష్క‌ర్‌-గాయ‌త్రి ఈ హిందీ సినిమాని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఒరిజినల్ సినిమాలో వేద అనే గ్యాంగ‌స్ట‌ర్‌, డ్ర‌గ్ స్ల‌గ్ల‌ర్‌ పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. విక్ర‌మ్‌ అనే పోలీసు అధికారి రోల్ లో మాధ‌వ‌న్ న‌టించారు.

Share post:

Latest