బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టంట్స్ వెళ్లేనా…?

తెలుగులో మొత్తంగా 4 సక్సెస్ ఫుల్ సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇక 5వ సీజన్ కు రెడీ అవుతుంది. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 5 జూలై లేదా ఆగష్టు నెలల్లో మొదలు అవుతుందని తెలుస్తుంది.

ఈ సీజన్ లో ఇక టాప్ కంటెస్టంట్స్ ను తీసుకునే ఆలోచనలో బిగ్ బాస్ బృందం వారు ఉన్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5లో టిక్ టాక్ స్టార్ దుర్గా రావు, జబర్దస్త్ హైపర్ ఆది, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ రాబోతున్నట్లు టాక్. ఇకపోతే జబర్దస్త్ నుండి 4వ సీజన్ లో అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తెలిసిందే. వీరితో పాటు ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్‌ సిరి హన్మంత్‌ కూడా బిగ్‌బాస్‌ లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు అనేక మంది టీవీ యాంకర్స్ అలాగే సోషల్ మీడియా లో పాపులర్ అయిన వాళ్ళు సీజన్ 5 లో కనిపించబోతున్నట్లు అనేక రకాల గాస్సిప్స్ ప్రచారంలో ఉన్నాయి.