పెళ్లి ర‌ద్దు చేసుకున్న మెహ్రీన్‌..భవ్య బిష్ణోయ్ వార్నింగ్‌!

ప్ర‌ముఖ టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్‌కు, హరియాణా మాజీ సీఎం భజన లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో గ‌త కొద్ది రోజుల క్రితం రాజ‌స్థాన్‌లోని జోధ్ పూర్ విల్లా ప్యాలెస్ లో ఎంగేజ్‌మెంట్‌ అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మెహ్రీన్‌.. భ‌వ్య‌తో నిశ్చితార్థం ర‌ద్దు చేసుకున్నాన‌ని, త‌మ పెళ్లి జ‌ర‌గ‌ద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది.

దాంతో ఆశ్య‌ర్యానికి గురైన నెటిజ‌న్లు మ‌రియు అభిమానులు.. ఎదో పెద్ద కారణంగా వల్లే మెహ్రీన్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని తనకు మద్దుతుగా నిలుస్తూ.. భవ్య బిష్ణోయ్‌, అతని కటుంబానికి వ్యతిరేకంగా సోష‌ల్ మీడియాలో ఆరోపణలు చేయడం ప్రారంభించారు. వీటిని గ‌మ‌నించిన భ‌వ్య బిష్ణోయ్‌.. ట్విట్ట‌ర్ వేదిక‌గా తన పై కానీ, తన కుటుంబంపై కానీ ఆరోపణలు చేస్తున్నవారికి సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చాడు.

పెళ్లి రద్దు అయ్యిందనే విషయంపై వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. అలా అని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు నాపై, నా ఫ్యామిలీపై ఆరోపణలు చేస్తే స‌హించేది. ఇంతటితో ఇవి ఆపేయండి. లేదంటే తప్పుడు వార్తలు, కామెంట్స్ చేసే వారి అకౌంట్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ భ‌వ్య ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈయన ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

Share post:

Popular