నోరు జారిన బాల‌య్య‌..మండిప‌డుతున్న ఏఆర్‌ రెహమాన్ ఫ్యాన్స్‌!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. నోటి దురుసుతోనూ లేదా చేతి దురుసుతోనూ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తుంటారు. అయితే ఆదిత్య 369 చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా.. బాల‌య్య తాజాగా ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్‌ గ్ర‌హీత ఏఆర్ రెహ‌మాన్‌పై బాల‌య్య నోరు జారి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారారు.

- Advertisement -

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజా ఇంట‌ర్వ్యూలో బాల‌య్య భారతరత్నను ఎన్టీఆర్ కాలిగోటితో పోలుస్తూ చేసిన కామెంట్సే కాకుండా.. ఏఆర్ రెహమాన్‌ను సైతం చులకనగా మాట్లాడారు. ఏఆర్‌ రెహమాన్‌కు ఆస్కార్‌ అవార్డు వచ్చినా.. ఆయనెవరో తనకు తెలియదని అన్నారు బాలకృష్ణ. ఏదో పదేళ్లకు ఒకసారి హిట్స్‌ అందిస్తాడు, అలాంటి వారి గురించి నేను అస‌లు ప‌ట్టించుకోను అంటూ వ్యాఖ్యానించారు.

దాంతో బాల‌య్య వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇవి చూసిన రెహ‌మాన్ ఫ్యాన్స్ బాల‌య్య మండిప‌డుతున్నారు. బాలకృష్ణ లాంటి ఒక సీనియర్ నటుడు లెజెండ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ పట్ల అలా మాట్లాడ‌టం దారుణమని ఫైర్ అవుతున్నారు. రెహమాన్‌ తెలుగులో తొలిసారి సంగీతం అందించింది.. బాలకృష్ణ సినిమాకే.. అది మ‌ర‌చి మాట్లాడుతున్నారా? అంటూ కొంద‌రు నెటిజ‌న్లు ప్ర‌శ్నించారు. మొత్తానికి బాల‌య్య వ్యాఖ్య‌లు మాత్రం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నారు.

 

Share post:

Popular