సచివాలయ ఉద్యోగులకు జగన్ షాకింగ్ న్యూస్..?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యాక ఎన్నో నూతన పథకాలు ప్రవేశ పెట్టాడు. నవరత్నాలు లాంటి పథకాలు అమలు చేస్తూ పరిపాలన వ్యవస్థలో సరికొత్త మార్పు తీసుకువస్తున్నాడు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల పని తీరుపై ఫోకస్ పెట్టిన జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయంతో ముందుకు వచ్చింది. సచివాలయ వ్యవస్థ ప్రారంభమై రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ కొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది.

ఇకపై ప్రతి సచివాలయ ఊద్యోగికి బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అంతే కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు డిప్యూటేషన్లను పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ, పశుసంవర్థక, సంక్షేమ శాఖ, పోలీసుస్టేషన్లలో డిప్యుటేషన్లలో సేవలు అందిస్తున్న ఉద్యోగులు ఇకపై సచివాలయాల్లోనే పని చేయాల్సి ఉంటుంది. ఇక నుండి జీతాల చెల్లింపులు కూడా బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే ఉండనున్నాయి.

Share post:

Latest