ఆనంది ‘సోడాల శ్రీదేవి’ లుక్ రిలీస్..!

తెలంగాణ బ్యూటీ ఆనంది ఈ ఏడాది జాంబిరెడ్డి సినిమాతో హిట్ కొట్టింది. ఈ వ‌రంగ‌ల్ భామ ప్ర‌స్తుతం సుధీర్ బాబు హీరోగా న‌టిస్తోన్న విలేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప‌లాస ఫేం క‌రుణకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం సోడా సెంట‌ర్ గ‌ర్ల్ ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ను విడుద‌ల చేశారు.

ఈ చిత్రంలో హీరోయిన్ ఆనంది సోడాల శ్రీదేవి పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని ఫ‌స్ట్ లుక్ ద్వారా తెలిపారు. గోలి సోడా కొడుతూ గ్రామీణ యువ‌తిగా క‌నిపించింది ఆనంది. 70 ఎంఎం ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ప‌లాస సినిమా తీసి సూప‌ర్ హిట్టు కొట్టాడు కరుణ కుమార్. ప‌లాస సినిమా స‌క్సెస్ తో అగ్ర నిర్మాత‌ల దృష్టిని త‌న వైపు తిప్పుకున్నాడు క‌రుణ కుమార్.

Share post:

Latest