డీఎస్పీ కి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన బన్నీ..వీడియో వైర‌ల్‌!

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌, టాలీవుడ్ టాప్ మోస్ట్ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ల‌ మ‌ధ్య ఆర్య సినిమా నుంచి మంచి స్నేహ‌బంధం ఏర్ప‌డింది. ఇక ఆ త‌ర్వాత వీరి కాంబోలో వ‌చ్చిన బన్నీ, ఆర్య 2, జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాథం ఇలా అన్ని సినిమాలు మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయ్యాయి.

దాంతో వీరిద్దరి బంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో తాజాగా డీఎప్సీకి బ‌న్నీ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపాడు. తన సినిమాలకి పనిచేసే టెక్నీషియన్స్‌కి ఇలా గిఫ్టులతో సడన్ సర్‌ప్రైజ్ ఇవ్వడం అల్లు అర్జున్ కు అలవాటు. అయితే బ‌న్నీ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ను ఎంతో ఆనందంగా దేవిశ్రీ ప్రసాద్ తన ట్విటర్‌ ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

అంతేకాదు, రాక్ స్టార్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ బన్నీకి ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. మ‌రి ఇంత‌కీ బ‌న్నీ డీఎస్పీ కి ఇచ్చిన ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో మీరు ఈ కింది వీడియోలో చూసేయండి.

https://twitter.com/ThisIsDSP/status/1412980886740508674?s=20