ఫిట్‌నెస్‌లో కొత్త ఛాలెంజ్ విసురుతున్న ఆలియా.. విష‌యం ఏంటంటే…?

బాలీవుడ్ అందాల ముద్దు గుమ్మ అలియా భట్ ఫిట్ నెస్ పరంగా ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో మనందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ 40 రోజుల ఫిట్ నెస్ చాలెంజ్ ని స్వీకరించింది. కాగా ఈ ఫిట్ నెస్ చాలెంజ్ నేటితో 20 రోజులు పూర్తయిందంటూ తన నడుమును చూపిస్తూ… సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేసింది. అలియా భట్ అనే కాకుండా బాలీవుడ్ బ్యూటీలందరు కూడా నడుమును నాజూగ్గా మెయింటెన్ చేస్తుంటారు.

అలియా భట్ షేర్ చేసిన ఈ ఫొటోకు ప్రముఖులందరూ స్పందిస్తున్నారు. రకరకాల కామెంట్లు పోస్టు చేస్తున్నారు. కాగా ఈ సుందరి ప్రస్తుతం తెలుగు మోస్ట్ వేటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ చేస్తోంది. మరో వైపు బ్రహ్మస్త్ర అనే హిందీ మూవీలో రణ్ బీర్ కపూర్ సరసన హీరోయిన్ గా చేస్తోంది. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఈ భామ క్రేజీ ఆఫర్లు కొట్టేస్తూ…. స్టార్ హీరోయిన్ గా మారింది.