బాలీవుడ్‌కు `యూ ట‌ర్న్‌`..స‌మంత పాత్ర‌లో ఎవ‌రంటే?

కన్నడలో సూపర్ హిట్ అయిన యూటర్న్ చిత్రాన్ని అదే టైటిల్‌తో తెలుగులోనూ తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో అక్కినేని స‌మంత లీడ్ రోల్ పోషించింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీల‌క పాత్ర పోషించ‌గా..పవన్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Alaya F: I don't have a set idea on what I want to do - DTNext.in

మిస్టరీ థిల్లిర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఇక్క‌డ కూడా మంచి విజ‌య‌మే సాధించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది. ఆరిఫ్‌ ఖాన్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్న‌ ఈ చిత్రంలో నటి పూజా బేడి కుమార్తె అలయా ఎఫ్ స‌మంత రోల్‌ను పోషించ‌బోతోంది.

తాజాగా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇక ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్‌, శోభా కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సౌత్ లో అద్భుతంగా ఆక‌ట్టుకున్న ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందో..లేదో..చూడాలి.