న్యూడ్‌గా ఫొటోకు పోజిచ్చిన రాహుల్ రవీంద్రన్..పిక్ వైర‌ల్‌!

న‌టుడు, ద‌ర్శ‌కుడు రాహుల్ రవీంద్రన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా కెరీర్‌ ప్రారంభించిన రాహుల్‌.. చిలసౌ సినిమాతో దర్శకుడిగా మార‌డ‌మే కాదు మొద‌టి సినిమాతో హిట్ అందుకుని జాతీయ అవార్డు అందుకున్నాడు.

ఈ చిత్రం త‌ర్వాత రాహుల్ స్టార్ డైరెక్ట‌ర్ రేంజ్‌కు ఎదుగుతాడ‌ని అంద‌రూ భావించారు. కానీ, అనూహ్యంగా నాగార్జున‌తో మన్మథుడు 2 తెర‌కెక్కించి.. ఘోర‌మైన ఫ్లాప్‌ను మూట‌క‌ట్టుకున్నారు. ఇక ప్ర‌స్తుతం న‌టుడుగా ఈయ‌న త‌మిళ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ ఉండే రాహుల్‌.. తాజాగా న్యూడ్ ఫోటో షేర్ చేసి షాక్ ఇచ్చాడు.

Rahul Ravindran: I am happy that Telugu cinema made it big in National  Awards- Cinema express

అయితే అది తన చిన్ననాటి ఫోటో. ఏడాది వయసులో ఉన్నప్పుడు ఒంటిమీద బట్టలు లేకుండా దిగిన తన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రాహుల్… ఇదే నా కెరీర్‌లో బోల్డెస్ట్ ఫోటో షూట్ అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో ఆయ‌న పిక్ వైర‌ల్‌గా మారింది.

Image